సాహో...శాతకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమీ పుత్ర శాతకర్ణిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శాతకర్ణిపై బాహుబలి డైరెక్టర్ రాజవౌళి స్పందించారు. ‘తెలుగు జాతి చరిత్రకు దర్పణం శాతకర్ణి. దీని వెనుక క్రిష్ చేసిన కృషి చాలానే ఉంది. అతను ఇంత గొప్ప చిత్రాన్ని 79 రోజుల్లో చేశాడంటే నమ్మలేకపోతున్నా’నని వ్యాఖ్యానించారు. క్రిష్‌ను చూసి చాలానే నేర్చుకోవాలన్నారు.
ఇక క్రేజీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అయితే తాను ఊహించింది నిజమైనందుకు ఎంతో థ్రిల్ ఫీలవుతున్నానన్నారు. పరోక్షంగా ‘ఖైదీ నెం 150’ను విమర్శిస్తూ నేను చెప్పిన మాటే నిజమైంది. అరువు తెచ్చుకున్న కథకంటే అసలైన కథే గెలిచింది. ఈ సినిమా 150 రెట్లు బాగుందంటూ ట్వీట్ చేశారు. తెలుగు జాతి తెలుసుకోవలసిన చరిత్ర ఇదని బోయపాటి అన్నారు. బాలకృష్ణ, క్రిష్, సాయిమాధవ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచారు. దర్శకుడు క్రిష్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాడవడం, తెలుగు చక్రవర్తి కథ రూపొందించడం తెలుగు జాతికి గర్వకారణమని దర్శకురాలు నందినీరెడ్డి అన్నారు. చిత్రీకరణ, నేపథ్య సంగీతం, బాలయ్య నటన, డైలాగులు ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్లిందన్నారామె.