చరణ్ సినిమాలో రాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ తేజ్, డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘్ధృవ’ తరువాత చరణ్, ‘నాన్నకుప్రేమతో’ తరువాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలుకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ రాశి ఒక ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. కెరీర్ మొదట్లో పవన్ సరసన ‘గోకులంలో సీత’లో నటించింది. ఈమె పాత్ర గురించి ఇతర విశేషాలు తెలియాల్సి వుంది. ‘కళ్యాణ వైభోగమే’ తర్వాత రాశి ఇన్నాళ్లకు మళ్లీ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.