కొత్త హీరోతో రొమాంటిక్ థ్రిల్లర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనాధ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.వై.జె.శ్రీరాజా దర్శకత్వంలో జి.రమేష్ రూపొందిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రొమాంటిక్ థ్రిల్లర్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీనాధ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నామని, మొదటి షెడ్యూల్ పూర్తయిందని, రెండో షెడ్యూల్‌లో మిగతా టాకీపార్ట్, పాటలు చిత్రీకరించనున్నామని తెలిపారు. ఓ జంట ప్రేమలో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను రొమాంటిక్ క్రైం థ్రిల్లర్ కథనంతో రూపొందిస్తున్నామని, సంగీతం ఈ చిత్రానికి ఆకర్షణగా వుంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:శ్యామ్ ధూపాటి, ఎడిటింగ్:వేణు, సంగీతం:ఘనశ్యాం, నిర్మాత:జి.రమేష్, రచన, దర్శకత్వం:ఆర్.వై.జె.శ్రీరాజా.