ఇది తెలుగుజాతి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారని, ఇది తెలుగుజాతి విజయమని నటుడు నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు. తన తండ్రి ఎన్టీఆర్ చేయవలసిన ‘శాతకర్ణి’ పాత్ర తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో గురువారం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల నుండి కూడా ‘శాతకర్ణి’కి మంచి స్పందన వస్తోందని, 79 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ అభినందనీయుడని అన్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ప్రాంతం రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో శాతకర్ణి జీవితగాథతో ఈ చిత్రం రావడం యాదృచ్ఛికమని, ఇది అజరామరంగా నిలిచిపోతుందని అన్నారు. కాగా, క్రిష్ వల్లే ఇంత పెద్ద విజయం సాధించగలిగామని, బాలకృష్ణ నటన ఈ సినిమాలో అద్భుతంగా సాగిందని కథానాయిక శ్రీయ తెలిపారు. ప్రతి భారతీయుడు, ప్రతి తెలుగువాడు ఈ సినిమాను చూసి ఆనందించాలని, తనకు అన్ని విషయాల్లోనూ బాలకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారని దర్శకుడు క్రిష్ అన్నారు. ‘శాతకర్ణి’కి సంబంధించి ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు క్రిష్ సమాధానాలిచ్చారు.