నాగార్జున హరేకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ వచ్చే నెల 10న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను హథీరాం బాబా జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి భక్తిరస సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాజుగారి గది-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్న నాగార్జున, ఆ తర్వాత మరో భక్తిరస సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే. కె.రాఘవేంద్రరావుతో కలిసి అన్నయ్య, మంజునాథ, శ్రీరామదాసు చిత్రాలకు పనిచేసిన రైటర్ జె.కె.్భరవి ఆమధ్య ‘ఆదిశంకరాచార్య’ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోకపోయినా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు భారవి దర్శకత్వంలో నాగార్జున నటిస్తాడని, ఈ సినిమా ఇస్కాన్ ఫౌండర్ స్వామి ప్రభుపాద జీవిత కథతో ఉంటుందని, పూర్తి భక్తిరస సినిమా కాకుండా సామాజిక అంశాలతో రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.