సందీప్ సరసన సాయి పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా, సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మంజుల తాజాగా దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా ఆమె ఒక అర్బన్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు హీరోయిన్‌గా ప్రేమమ్‌తో సౌతిండియన్ సినిమాలో హాట్ టాపిక్‌గా మారిన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనున్నారు. ఇప్పటికే ఆమె ఈ సినిమాకు సైన్ చేశారట. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాను లండన్‌తోపాటు ఇండియాలోని పలు నగరాల్లో తెరకెక్కించనున్నారట. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ కూడా కొత్త లుక్ ప్రయత్నిస్తూ ఉన్నారు. సాయి పల్లవి ఇప్పటికే తెలుగులో ఫిదా అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవ్వగా, ఆమె ఒప్పుకున్న రెండో సినిమా సందీప్ కిషన్‌తో వస్తోంది. జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.