వసూళ్లలో ‘ఖైదీ నెం 150’ కొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ పదేళ్ల తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్‌గా తొలిరోజు వసూళ్లల్లో నెంబర్ వన్‌గా నిలిచిందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తొలిరోజు ఏకంగా 47.7 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించిందని, తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి రోజు 30.5 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. కర్నాటకలో 4.70కోట్లు, ఓవర్‌సీస్ (అమెరికా)లో 1.22 మిలియన్ డాలర్లు, అమెరికా మినహా మిగతా చోట్ల 3,20,000 డాలర్లు, నార్త్ అమెరికాలో 8.90 కోట్లు, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో 2.12 కోట్లు, ఒరిస్సాలో 12 లక్షలు, తమిళనాడులో 20 లక్షలు వసూలు చేసిందని, ఇతర చోట్ల ఓ 58 లక్షల వసూళ్లు దక్కాయని ఆయన వివరించారు. పదేళ్ల తర్వాత చిరంజీవి రీఎంట్రీ కనుక ఆయన ఎలా వున్నారో చూడాలని అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు వస్తున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులు, అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఈ చిత్రాన్ని వీక్షించేందుకు వేచి చూశారని ఆయన అన్నారు. దాదాపు 2వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామని, సినిమా కథాంశాన్ని మించి చిరంజీవి కమ్‌బ్యాక్ వెయిటేజిని చూడాలని ప్రజలు తహతహలాడారని తెలిపారు. చిరంజీవి నటించనున్న 151వ చిత్రానికి బోయపాటి దర్శకుడిగా అనుకున్నామని, కొన్ని కారణాలవల్ల అది ఆలస్యం అవుతుందని, కథ కూడా సిద్ధం అయిందని తెలిపారు. ఇంత పెద్ద విజయం సాధించాక జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచనతో భయం కలుగుతుందని, ఈలోగా రామ్‌చరణే చిరంజీవితో మరో సినిమాను రూపొందించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. అయితే ఈ సినిమాకు సురేందర్ రెడ్డి పేరు వినిపించడం సహజమేనని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కూడా పరిశీలనలోనే ఉన్నదని వివరించారు.