మళ్లీ మెరుస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంత్ర’ చిత్రంతో మతి తప్పేలా చేసింది ఛార్మి. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా అవేవీ అంత కిక్కివ్వలేదు. మంగళ, బుడ్డాహోగా తేరాబాప్, కావ్యాస్ డైరీ చిత్రాలు వచ్చాయి. అటుపై జ్యోతిలక్ష్మిగా ఓ ఊపుఊపాలని ప్రయత్నించినా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఈ చిత్రంలో మగాళ్ళను ఆడుకునే వేశ్యగా రెబల్‌గా కనిపించి మెప్పించిన ఛార్మి ఆతర్వాత కూడా వేశ్య పాత్రలో నటించి ఫెయిలైంది. అయితే ఇటీవలి కాలంలో పూరి కాంపౌండ్‌లో చేరి వివాదాల్లో వేలెట్టింది. దాంతో ఆ తర్వాత కథానాయికగా నటించిన దాఖలాలు కనిపించలేదు. ఛార్మి నటించిన మంత్ర-2 ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. మరి కొత్త సంవత్సరంలో కొత్తగా వచ్చేందుకు ఛార్మింగ్ బ్యూటీ ఏం ప్లాన్ వేస్తుందో చూడాలి.