జర్నలిస్టుగా నయన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే స్టార్ హీరోలతోనే సినిమాలు చేయనక్కర్లేదని సోలోగాకూడా లేడీ సూపర్‌స్టార్ అనే బిరుదు తెచ్చుకోవచ్చని నిరూపించిన హీరోయిన్ నయనతార. ‘మాయ’, ‘అనామిక’, ప్రస్తుతం ‘డోరా’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన నయన్ తాజాగా నూతన దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్షన్‌లో ఒక సినిమాకి సైన్ చేసింది. ఈ చిత్రాన్ని ఇండియాలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ గురించి భరత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో ‘నయన్ జర్నలిస్టుగా కనిపిస్తుంది. తన మూలాల్ని, కుటుంబాన్ని వెతుక్కుంటూ కొండలు, ఎడారులు దాటి అనేక దేశాల్లో ప్రయాణించి చివరకు తమిళనాడు చేరుకొనే స్ర్తి కథే ఈ చిత్రం. ఈ రియలిస్టిక్ థ్రిల్లర్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, మంగోలియా దేశాల్లో షూటింగ్ చేస్తాం. దాదాపు 75శాతం సినిమా వేరే దేశాల్లోనే జరుగుతుంది. మార్చినుండి షూట్ మొదలుపెడతాం’ అని తెలిపారు.