యుద్ధ సన్నివేశాలు నచ్చాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుజాతి గౌరవాన్ని పెంచిన చిత్రం అంటూ యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ప్రదర్శించిన ఈ షోను చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆయనతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం మీడియాతో తన మనసులోని మాటను పంచుకొన్నారు. ‘సినిమా అద్భుతంగా ఉంది. మాటలు మొదలుకొని పాటలు, స్క్రీన్‌ప్లే అన్నీ ఒకదాన్నిమించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. నవతరానికి తెలుగు జాతి చరిత్రను తెలియజెప్పేందుకు దర్శకుడు క్రిష్, బాలకృష్ణ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కేవంల 79 రోజుల్లో ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని పూర్తిచేయడం, ఈ రేంజ్ అవుట్‌పుట్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అన్నిటికంటే.. ఈ సినిమాలో వార్ సీన్స్ నాకు విపరీతంగా నచ్చేశాయి. సాధారణంగా నా బిజీ షెడ్యూల్ కారణంగా నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తుంటాను. అయితే.. భారతీయ సినిమా చరిత్రలో ఈ స్థాయి వార్ సీక్వెన్స్‌లు నేను ఇదివరకూ చూడలేదు. శాతకర్ణిగా బాలయ్య తప్ప వేరెవ్వరూ న్యాయం చేయలేరు’ అని ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు నాకు ఈ సంక్రాంతిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీయని విజయాన్ని అందించారు. తెలుగువారికి మాత్రమేకాదు యావత్ భారతదేశానికే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ కీర్తికిరీటం’ అన్నారు. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ‘మా నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు సినిమా అభిమానులకు నా ధన్యవాదాలు. వారి అండ, తోడ్పాటు లేనిదే ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించి ఉండేది కాదు’ అన్నారు. సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘నా కల నెరవేరిన రోజిది. బాలకృష్ణగారి 100వ చిత్రానికి మాటలు రాసే అదృష్టం దక్కడం నా పూర్వజన్మ సుకృతం. మా అమ్మ ఆశీర్వాద బలమే నేడు నాకు లభిస్తున్న కీర్తిప్రతిష్టాలకు కారణం’ అన్నారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘సినిమాకి లభించిన అపూర్వ స్పందనతో సినిమా నిర్మాణంకోసం పడిన శ్రమ మర్చిపోయాం’ అన్నారు.