దంగల్ హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశేష ప్రేక్షకాదరణ పొందిన బాలీవుడ్ చిత్రం దంగల్ మరో ఘనత సాధించింది. 62వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ప్రధానమైన మూడు అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. హర్యానాకు చెందిన మల్లయోధుడు మహావీర్‌సింగ్ ఫొగట్, అతడి ఇద్దరు తనయల జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారికి ఉత్తమ దర్శకుడి అవార్డు రాగా ఇందులో ప్రధాన పాత్రలో నటించిన అమీర్‌ఖాన్‌కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. కాగా ‘ఉడ్తా పంజాబ్’ చిత్రంలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను అలియాభట్‌ను ఉత్తమ నటి అవార్డు వరించింది.
ముంబైలో శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన 62 జియో ఫిలిమ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో అతిరథమహారథులు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తికట్టించాడు. సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా, వరుణ్‌ధావన్, టైగర్‌ష్రాప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అలనాటి నటి శ్రీదేవి, అలియాభట్ సహా ప్రముఖ నటీనటులు పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ సందర్భంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందిన నితీష్ తివారీ మాట్లాడుతూ ‘ఈ అవార్డు దంగల్ సినిమాను ప్రేమించిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది’ అని అన్నారు. ఉత్తమ నటి అలియాభట్‌కు నటి శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ సంయుక్తంగా అవార్డును అందజేశారు. అలియాభట్ మాట్లాడుతూ ‘ఇది నా మనకు ఎంతో నచ్చిన సందర్భం. ఓ మంచి కథలో నన్ను నటింపచేసినందుకు ఆనందంగా వుంది. శ్రీదేవి వంటి గొప్ప నటి చేతులమీదుగా ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ అవార్డును తీసుకోవడం కూడా సంతోషాన్నిస్తోంది’ అని అన్నారు. తన తండ్రి మహేష్‌భట్‌తో ఆనందాన్ని పంచుకుంటూ తాను కావాలని అనుకున్నది తప్పక తనకు చెందుతుందని, ధైర్యమిచ్చిన తన తండ్రికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ అలియా సంతోషం వ్యక్తం చేసింది. క్రిటిక్స్ అవార్డులలో భాగంగా ఉత్తమ నటిగా సోనమ్‌కపూర్ (నీర్జా), ఉత్తమ నటులుగా మనోజ్‌బాజ్‌పాయ్, షాహిద్‌కపూర్ (అలీఘర్, ఉడ్తాపంజాబ్) అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటిగా క్రిటిక్స్ నుండి సోనమ్‌కపూర్ (నీర్జా) ఫిలిమ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ దర్శకుడిగా ‘నీర్జా’ రూపకర్త అవార్డు పొందగా తొలి ప్రయత్నంలో ఉత్తమ దర్శకుడి అవార్డును అశ్విని అయ్యర్ (నిల్‌బత్తె సన్నాట), ఉత్తమ నటుడిగా ఉడ్తా పంజాబ్ చిత్రంలో నటించిన దిల్జిత్ దొసాంజ్, ఉత్తమ నటిగా ‘సాలాఖద్దూస్’ చిత్రంలో నటించి మెప్పించిన రితికాసింగ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఫిలిమ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అలనాటి మేటి నటుడు శత్రుఘ్నసిన్హాను వరించగా అతడి కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా అందుకున్నారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడం అంటే ఇక అది చరమాంకంగా చాలామంది భావిస్తారని, కానీ తాను మాత్రం శుభారంభంగా భావిస్తున్నానని శత్రుఘ్నసిన్హా తన ప్రసంగంలో తెలిపారు. ఉడ్తాపంజాబ్ చిత్రానికి గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాయల్ సలూజా అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్షన్ విభాగంలో దంగల్ చిత్రానికి పనిచేసిన శ్యామ్‌కౌశల్, స్టంట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు తీసుకున్నారు. కరణ్‌జోహార్ రూపొందించిన ‘ఏ దిల్‌హై ముష్కిల్’ చిత్రానికి నాలుగు అవార్డులు లభించడం మరో విశేషం. ఉత్తమ నేపథ్యగాయకుడుగా ఆర్జిత్‌సింగ్ ‘ఏ దిల్‌హై ముష్కిల్’ పాటకు ఈ అవార్డు అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రీతమ్, అమితాబ్‌భట్టాచార్యలకు, ఉత్తమ పాటల రచయితగా చెన్నామేరేయా పాట రాసినందుకు అవార్డు లభించింది. ఈ నాలుగు ఒకే చిత్రానికి దక్కడం విశేషం. నేహాభాషిన్ ఉత్తమ నేపథ్య గాయకురాలిగా ‘సుల్తాన్’ చిత్రంలో ‘జగ్ ఘోమేయా’ పాటకు గాను అవార్డు అందుకున్నారు. ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రానికి నాలుగు అవార్డులు లభించాయి. రిషికపూర్ ఉత్తమ సహాయ నటుడుగా, ఆదిల్ షాఖిన్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, కర్ గయిచుల్ పాటకు గాను ఉత్తమ రచయిత అవార్డు లభించింది. షాకున్‌బట్రాకు ఉత్తమ కథా రచయిత్రిగా, బెస్ట్ స్క్రీన్‌ప్లే రచయితగా ఆయేషాదేవిత్ర అవార్డులు అందుకున్నారు. ఈ నాలుగు అవార్డులు కపూర్ అండ్ సన్స్ చిత్రానికి సంబంధించినవి కావడం విశేషం. నీర్జా చిత్రంలో అద్భుతన నటన ప్రదర్శించిన షబ్నాఅజ్మీకి ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కార్యక్రమం ప్రారంభం నుంచి ఆహూతులను కిర్రెక్కిస్తే.. సల్మాన్‌ఖాన్ పలువురు సినీ నటీనటులతో కలసి నృత్యాలు చేసిన పాటలకు ఆహుతులనుండి స్పందన లభించింది. ఓ జానేజానా, మున్నీబద్నామీహై పాటలకు మంచి ఆదరణ లభించింది. ది పప్పీ సాంగ్, ఆ రహాహమ్‌హై, ధూమ్ ఎగైన్ పాటలకు గాను నృత్యాలు చేసిన టైగర్ ష్రాఫ్ ఆహుతులను అలరించారు. వైభవంగా జరిగిన ఈ ఫిలిమ్‌ఫేర్ అవార్డులలో ప్రతిభకే పట్టం కట్టారు అని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు వ్యాఖ్యానించడం విశేషం.

చిత్రాలు..కుటుంబ సభ్యులతో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేత శత్రుఘ్నసిన్హా
*వేదికపై సల్మాన్ సందడి