26న సింగం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, శ్రుతిహాసన్, అనుష్క ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం సింగం-3 (యముడు-3). ఈ చిత్రాన్ని ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు భాషల్లో సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం గత చిత్రాలకు కొనసాగింపుగా వస్తోందని తెలిపారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పరుగులు పెట్టే స్క్రీన్‌ప్లేతో, థ్రిల్ కలిగించే సన్నివేశాలతో ఈ చిత్రం సాగుతుందని అన్నారు. తెలుగు ప్రేక్షకులలో హరి స్క్రీన్‌ప్లేకు అభిమానులు ఉన్నారని, ఇప్పటికే విడుదలైన టీజర్స్‌కు అభిమానులనుండి భారీ అంచనాలు వచ్చాయని తెలిపారు. అభిమానుల అంచనాలు అందుకునేలా ఈ చిత్రంలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా మరోసారి నటించారని, అనుష్క నటనకి, శృతిహాసన్ గ్లామర్‌కు మార్కులు పడతాయని తెలిపారు. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా ఇతివృత్తమని, హ్యారిస్ జైరాజ్ ఆడియో సూపర్‌హిట్ అయిందని తెలిపారు.