మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన నూరవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. ఆయన చెప్పినట్టు నిజంగా బాలయ్య శకం ప్రారంభం అయింది. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నిర్మాత సాయి కొర్రపాటి కన్‌ఫర్మ్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వైజాగ్, సీడెడ్ హక్కులను తీసుకున్న నిర్మాత సాయి కొర్రపాటి వైజాగ్‌లో మాట్లాడుతూ, బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ తన వారాహి చలన చిత్ర బ్యానర్‌లోనే ఉంటుందని, త్వరలోనే సినిమా గురించి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. బాలయ్య వారసుడు ఈ ఏడాదిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్నమాట!