నరుూమ్ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాంగ్‌స్టర్ నరుూమ్ జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖయ్యూమ్ భాయ్’. కట్టా రాంబాబు, తారకరత్న ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 90 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- హైదరాబాద్, అమరావతి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశామని, చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుతున్నామని తెలిపారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని తెలిపారు. తారకరత్న ఓ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో నరుూమ్ ఎన్‌కౌంటర్ జరిగేవరకు జరిగిన అతని జీవితంలో పలు విశేషాలను ఈ చిత్రంలో అందిస్తున్నామని ప్రధాన పాత్రధారి కట్టా రాంబాబు అన్నారు. ఐదు పాటలతో రూపొందిస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని దర్శకుడు భరత్ తెలిపారు. కార్యక్రమంలో చిన్నా, బాహుబలి ప్రభాకర్, ఫైట్ మాస్టర్ విజయ్ తదితరులు విశేషాలు తెలిపారు. వౌని, ప్రియ, హర్షిత, రాగిణి, సుమన్, చలపతిరావు, బెనర్జీ, ఎల్.బి.శ్రీరాం, జీవా, వినోద్, రాంజగన్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:శ్రీ్ధర్ నార్ల, సంగీతం:శేఖర్ చంద్ర, మాటలు:్భవాని ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:్భరత్.