‘దర్శకుడు’ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ దర్శకుడిగా టాలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న సుకుమార్ టాలీవుడ్‌లో టాప్ దర్శకుడిగా ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో వైపు తన అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నంలోనే కుమారి 21ఎఫ్‌తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆయన నిర్మాతగా రెండో సినిమాగా ‘దర్శకుడు’ అనే టైటిల్‌తో సినిమా ఆమధ్య మొదలై షూటింగ్ కూడా పూర్తికావచ్చింది. మరోవారం రోజుల్లో సినిమా నిర్మాణం ముగస్తుందని సమాచారం. ఈ సినిమాతో సుకుమార్ అన్న కుమారుడు అశోక్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ‘దర్శకుడు’ పేరుతో రూపొందే ఈ సినిమా ఓ స్టార్ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సహాయ దర్శకుడి ప్రేమకథతో ఉంటుందట. ఇందులో హీరోయిన్‌గా ఈషా నటిస్తోంది. ఈ సినిమాకు ‘హర్ లవ్ ఈజ్ ప్యాషన్’ ట్యాగ్‌లైన్ ఉంటుంది. సుకుమార్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్న హరిప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్‌కి రెడీ అవుతుంది.