చివరి షెడ్యూల్‌లో గోపీచంద్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్-సంపత్‌నంది కాంబినేషన్‌లో ఇంకా పేరు నిర్ణయించని చిత్రానికి సంబంధించిన మూడు షెడ్యూల్స్ పూర్తిచేశారు. నాలుగో షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నారు. బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జె.్భగవాన్, జె.పుల్లారావు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, థాయ్‌లాండ్, హైదరాబాద్‌లలో మూడు షెడ్యూల్స్ పూర్తిచేశామని, ఫిబ్రవరి 20 వరకు జరిగే నాలుగో షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తామన్నారు. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గాసాగే ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా వేసవి కానుకగా విడుదలవుతుందని అన్నారు. హన్సిక, కేథరీన్, నికితిన్‌ధీర్, తనికెళ్ల భరణి, ముకేష్ రుషి, అజయ్, సచిన్ కేల్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎస్.సౌందరరాజన్, నిర్మాతలు:జె.్భగవాన్, జె.పుల్లారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సంపత్‌నంది.