దర్శకుడి క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వార్తలు రావడంతో నూతన దర్శకుడు సాయిరామ్ దాసరి ప్రజలకు క్షమాపణలు తెలిపారు. సాయిరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ద్యావుడా’ చిత్రం టీజర్ చూశాక హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇందుకు దర్శకుడు క్షమాపణ చెప్పాలని ఆందోళన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఈ చిత్రం రూపొందించలేదని, తానూ హిందువునేనని సాయిరామ్ తెలిపారు. టీజర్ చూసి ఇంతమంది స్పందిస్తుంటే తన బాధ్యతగా క్షమాపణ తెలుపుతున్నానని అన్నారు. కర్నాటకలో కొన్ని దేవాలయాలలో నిర్వహించే పూజా విధానాన్ని తాను చిత్రించే ప్రయత్నం చేశానే తప్ప, భక్తుల మనోభావాలు దెబ్బతీయటానికి కాదని, అలజడి రేపిన ఆ దృశ్యాలను తన చిత్రం నుండి తొలగిస్తున్నానని వివరించారు.