బొమ్మరిల్లు లాంటి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తీసే నిర్మాతగా దిల్‌రాజుకు పేరుంది. ఆయన సినిమాలంటే జనాలకు ప్రత్యేకమైన ఆసక్తి. తాజాగా దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా దిల్‌రాజు చెప్పిన విశేషాలు..
ఇంత రెస్పాన్స్ ఊహించలేదు
ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్నిచోట్లా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. పంపిణీదారులు పెట్టిన పెట్టుబడి రెండు,మూడు రోజుల్లో వెనక్కి రావడం ఆనందంగా ఉంది. మొదటినుండి ఈ సినిమాపై ఉన్న నమ్మకం నిజం అయింది. ఇక రెవెన్యూ పరంగా మిరకిల్ అని చెప్పాలి. ఓవర్‌సీస్‌లో కూడా అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. రెండు పెద్ద సినిమాలు ఉన్నా కూడా ‘శతమానం భవతి’ హిట్ కావడం ఆనందంగా వుంది.
బర్నింగ్ ఇష్యూ
దర్శకుడు సతీష్ చెప్పినప్పటినుండి ఈ కథపై నాకు నమ్మకం కలిగింది. కథ విన్న శర్వానంద్ కూడా బాగుందని అన్నాడు. ఈ కథ ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించే. తల్లిదండ్రులను వదిలేసి.. ఉద్యోగాల కోసం ఏళ్లకేళ్లు దూరంగా ఉన్నప్పుడు.. ఆ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎలా వుంటుంది అన్నది అసలు కథ. ఒకరకంగా ఇది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అని చెప్పాలి. ఈ సినిమా ఒక్క ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. యూత్‌కి కావలసిన అంశాలు అన్ని ఉన్నాయి. ప్రేక్షకులకు నచ్చిన అంశాలున్న సినిమా తీస్తే చాలు.. అంతేకానీ రామాయణాలు, మహాభారతాలు తీయాల్సిన పనిలేదు.
నిజమైన విజయం
దర్శకుడు సతీష్ మా టీమ్‌లో రైటర్‌గా పనిచేస్తూ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలకు పనిచేశాడు. తాను అప్పటికే ఓ ప్లాఫ్ సినిమా చేశాడు, మరో సినిమా విడుదల కాలేదు.. కానీ ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తన కళ్ళలో నిజమైన ఆనందాన్ని చూస్తున్నా.
పెద్ద సినిమాల మధ్య..
నిజానికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో ధైర్యంగా ఈ సినిమా విడుదల చేయడానికి కారణం కథపై ఉన్న నమ్మకమే. పైగా ఈ సినిమా కచ్చితంగా పండగకు విడుదల చేయాల్సిన సినిమా కావడంతో వెనక్కి తగ్గలేదు.
తర్వాతి సినిమాలు
నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నాం. మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే సినిమా సెప్టెంబర్‌లో మొదలుపెట్టి వచ్చే సమ్మర్‌లో విడుదల చేస్తాం.

-శ్రీ