ఏడాది విరామం తర్వాత రవితేజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఇప్పటికీ మేకప్ వేసుకోని రవితేజ- ఎందుకో స్పీడ్ తగ్గించాడు. విరామం లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనడం వల్ల కాస్త రెస్ట్ తీసుకుంటున్నాని టాక్. అందుకే విదేశాలను చుట్టొచ్చే పనిలో ఉన్నాడట. 2016లో రవితేజ ఒక్క సినిమా కూడా చేయలేదు. బెంగాల్ టైగర్ తరువాత చాలా కథలు విన్నా, చాలామంది దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఎందుకో ఒక్క సినిమాకు కూడా ఈ మాస్‌హీరో కమిట్ కాలేదు. ఫైనల్‌గా ఆయన పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమాకు ఓకె చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చిన ఈ సినిమా మార్చిలో మొదలుకానుందట. ఈ ఏడాది కచ్చితంగా రెండు సినిమాలు చేస్తానని అంటున్నాడు రవితేజ. మరో సినిమా ఓ యువ దర్శకుడితోనే ఉంటుందని సమాచారం. ఇటీవలే ఓ సందర్భంగా రెస్పాండ్ అయిన రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలు చేయడానికి రెడీ అయ్యానని చెప్పాడు. కొత్త సంవత్సరంలో ఇప్పటి నుంచే స్పీడ్ పెంచాలని ఫిక్స్ అయ్యాడట.