బాధ్యతగా చేస్తే.. భారీ హిట్ దక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సినిమా చిత్రీకరణలో మేం ఎలా ఆలోచించినా, ప్రేక్షకులందరూ నందమూరి బాలకృష్ణ శాతకర్ణిగా వందశాతం న్యాయం చేశాడని ఒప్పుకుంటున్నారు. ఈ పాత్రను ఆయన తప్ప మరెవరూ చేయలేని విధంగా నటించారు ఆయన. ఇలాంటి చారిత్రక కథను చేస్తున్నప్పుడు భయం లేకుండా బాధ్యతగా ఆలోచించి చేశాం. అప్పట్లో ఏం జరిగిందో అని చూపించడం కంటే, గౌతమిపుత్ర శాతకర్ణి పాత్ర ఎంత బాగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లామనే విషయానే్న ఆలోచించాం’- అని దర్శకుడు క్రిష్ తెలిపారు. బాలకృష్ణ కథానాయకుడిగా వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు రూపొందించిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తన ఆలోచనలను దర్శకుడు క్రిష్ తెలిపారు. ఈ విజయం కోసం తమ వంతుగా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకరించారని, ప్రీమియర్ చూసేటప్పుడే బాలకృష్ణ ఈ సినిమా హిట్ అయిందని తనతో అన్నారని క్రిష్ తెలిపారు. కథ రాసుకున్నప్పుడే బాలకృష్ణనే హీరోగా అనుకున్నామని, శాతకర్ణి గురించి అధ్యయనం చేశాక ఎన్నో వైవిధ్యమైన అంశాలు తెలిశాయని అన్నారు. తెలిసింది తక్కువ కనుక ఆ విషయాలతో సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేశానని అన్నారు. నాలుగు భాగాలుగా ఈ చిత్రాన్ని తాను విభజించుకోగా, మొరాకోలో జరిగిందంతా ఒక సెట్ అయితే, అమరావతి ఒక సెట్‌గా, కళ్యాణదుర్గం, సౌరాష్ట్రాల్లో యుద్ధం ఒక సెట్‌గా, గ్రీకులతో యుద్ధం ఒక సెట్‌గా రాసుకున్నానని తెలిపారు. షూటింగ్ అవుతుండగానే ఎడిటింగ్ చేసుకుంటూ వచ్చామని, అందువల్లే సినిమాను 79 రోజుల్లో పూర్తిచేశామని తెలిపారు. షూటింగ్‌లో తనతో పాటు పూర్తి సమయం కేటాయించేలా చిరంతన్ భట్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా, ‘విక్టరీ’ వెంకటేష్ నటించే 75వ సినిమాను తాను రూపొందిస్తున్నానని, దాని తరువాత ఓ బాలీవుడ్ చిత్రాన్ని చేస్తానని క్రిష్ చెప్పారు.