మార్చి నుండి పవన్, త్రివిక్రమ్‌ల సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ అంటే ఎంతటి క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గతంలో వారి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది విజయాలను చూస్తే అర్థమైపోతుంది. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే హిట్ ఖాయమనే బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే త్వరలో వీరు చేయనున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2016 ఆఖరులో అధికారికంగా లాంచ్ అయిన వీరి చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల రీత్యా పవన్‌కల్యాణ్ డాలీ దర్శకత్వంలో చేస్తున్న ‘కాటమరాయుడు’ షూటింగ్ ఆలస్యమైంది. ఇది ఫిబ్రవరికి పూర్తయ్యేలా ఉంది. దీంతో పవన్-త్రివిక్రమ్ సినిమా మార్చిలో మొదలుకానుంది. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నారు.