యాడ్స్‌పైనే గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ తర్వాత మళ్లీ సినిమాల్లో కనపడలేదు హీరోయిన్ సమంత. అక్కినేని ఫ్యామిలీ మెంబర్‌గా మారబోతూ అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ దగ్గర నుంచి అతని పెళ్లివరకూ వదినగా అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది సమంత. ఇప్పటికే మాజా.. పారగాన్.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్.. లక్స్.. జ్యూవెల్ వన్ లాంటి కంపెనీలతోపాటు ఇంకా కొన్ని వ్యాపార సంస్థలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. తాజాగా హిటాచి ఎయిర్ కండిషనర్స్‌కి కూడా సైన్ చేసింది. రాబోయే సమ్మర్‌లో ఏసీల అమ్మకలా పెంచుకునేందుకు సౌత్ సేల్స్‌పై దృష్టిపెట్టిన ఈ కంపెనీ సమంతతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పటికే యాడ్ షూటింగ్ ముంబయిలో ప్రారంభమైంది కూడా. సినిమాల కంటే కూడా కమర్షియల్ యాడ్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుంది.