వచ్చేనెలలో ఎన్టీఆర్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తన కొత్త సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దర్శకుడు బాబీ తెరకెక్కించే ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 11న సినిమాను ప్రారంభించి, అదే రోజున సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్ర బృందం భావిస్తోందట. ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్‌రామ్ భారీగా నిర్మించే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందే అంచనాలు రేకెత్తిస్తోంది. జై లవకుశ పేరుతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కల్యాణ్‌రామ్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయడంతో ఆ పేరు ఖరారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ను ఓ కొత్త కోణంలో చూపించే సినిమాగా ఇది నిలుస్తుందట. అన్ని కమర్షియల్ హంగులతో, టెక్నికల్‌గా భారీ హంగులతో సినిమా తెరకెక్కనుంది.