టీజర్‌లో పిచ్చిగా నచ్చావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన ఉత్తేజ్ హీరోయిన్‌గా పరిచయం చేస్తూ శశిభూషణ్ దర్శకత్వంలో సంజీవ్, నందు, కారుణ్య ముఖ్యపాత్రల్లో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న పిచ్చిగా నచ్చావ్ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను యువనటుడు నవీన్ చంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నవీన్ చంద్ర మాట్లాడుతూ, టాలెంట్ వున్న నటుడు ఉత్తేజ్ కుమార్తె హీరోయిన్‌గా పరిచయమవ్వడం ఆనందంగా వుంది. అప్పట్లో ‘చిత్రం’ సినిమాలో కుక్క కావాలి అంటూ బాగా పాపులరైన చేతన ఈ రోజు హీరోయిన్‌గా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆమె తప్పకుండా మంచి విజయం అందుకోవాలి’ అన్నారు. దర్శకుడు శశిభూషణ్ మాట్లాడుతూ,‘దీన్ని యూత్‌ఫుల్ రొమాంటికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రపంచంలో లవర్ లేనివాడు ఉంటాడేమోగాని, స్నేహితుడు లేనివాడు ఎవరూ ఉండరు అనే కానె్సప్టుతో తెరకెక్కించిన చిత్రమిది’ అన్నారు. హీరోయిన్ చేతన మాట్లాడుతూ, ఈ సినిమాకు అన్ని రకాల పాజిటివ్ ఎనర్జీలు కుదిరాయని, ఇది మన చుట్టూ జరిగే కథ అని, మన ఇంట్లో అబ్బాయో లేదా పక్కింట్లో అమ్మాయో ఎలా వుంటున్నారనే అంశాలపై తెరకెక్కించిన సినిమా ’అన్నారు.