ద్యావుడా దర్శకుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన సినిమా టీజర్ విడుదలైన రోజు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ‘ద్యావుడా’ సినిమా దర్శకుడు సాయిరామ్ దాసరిని హైదరాబాద్‌లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ‘ద్యావుడా’ టీజర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన తర్వాత హిందూ మతాభిమానుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీసిన దర్శకుణ్ణి అరెస్టు చేసి ప్రశ్నించాలని పలు ఆధ్యాత్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సాయిరామ్‌ను అరెస్టు చేశారు. కర్నాటకలోని కొన్ని దేవాలయాల్లో చేసిన పూజావిధానం మాదిరిగానే తాను తన టీజర్‌లో చిత్రీకరించానే తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదని ఆయన చెబుతున్నారు. శివలింగాన్ని మందు బాటిళ్ళతోను, సిగరెట్లతోను అభిషేకం చేసినట్లు సినిమాలో చిత్రీకరించడమే ఈ వివాదానికి కారణమైంది. నిర్మాత హరికుమార్ రెడ్డి కోసం గాలిస్తున్నామని, దర్శకుడు సాయిరామ్‌ను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.