దీపిక సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ దీపిక పదుకొనె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీపిక ఇలాంటి సంచలన కామెంట్స్ చేయడం ఏంటా? అని అనుకుంటున్నారు సినీ జనాలు. ఇంతకీ దీపిక అన్న మాటలు ఏంటో తెలుసా? దీపిక ట్రిపుల్ ఎక్స్ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్ సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక, తనకు విన్‌డీజిల్ మీద చాలా క్రష్ వుందని, అతని ద్వారా పిల్లలను కన్నానంటూ సంచలనం రేపింది. అతనిమీద వున్న క్రష్ పక్కన పెడితే, దీపిక ఎప్పుడు పిల్లల్ని కన్నది? అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా నిజంగా కాదట. ‘కలలో’ అని చెప్పి షాకిచ్చింది. మొత్తానికి విన్ డీజిల్‌తో దీపిక వ్యవహారం కాస్త తేడాగానే వుందని గుసగుసలాడుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందట. విన్ డీజిల్ అంటే దీపిక అమితాసక్తిని చూపిస్తోందని, వీరిద్దరిమధ్య డేటింగ్ వ్యవహారం వుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.