ఎప్పటికీ మెగాస్టారే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెం.150వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ పథంలో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ నటన, డాన్సులు ఆకట్టుకున్నాయని, చిరంజీవి అప్పటికి ఇప్పటికీ మెగాస్టారే అంటూ ఆయనను అభినందించారు ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత, కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి. హైదరాబాద్‌లో ఆత్మీయ వేడుక పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ, రామ్‌చరణ్, దర్శకుడు వి.వి.వినాయక్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.