విజయనిర్మలతో పోలిస్తే ఆనందంగా ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా సినిమా పరిశ్రమలో మహిళా దర్శకులు చాలా తక్కువ. తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్లను వేళ్లపై లెక్కించవచ్చు. మీడియా రంగంనుండి దర్శకురాలిగా తాను చేసిన తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు బి.జయ. తాజాగా ‘లవ్‌లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘వైశాఖం’ చిత్రాన్ని కొత్త నటీనటులతో తెరకెక్కించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె చిత్ర విశేషాలను పాత్రికేయులతో ముచ్చటించారు.
మంచి సినిమాకోసమే
‘లవ్‌లీ’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటంటే, గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఓ హిట్ చిత్రం తీయాలనుకోవడమే. ప్రస్తుతం మంచి కథ సిద్ధమైంది. ‘వైశాఖం’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. ఈనెల 18న ప్రారంభం కానుంది. మనం ఎలాంటి సినిమా తీసినా ఆ కథను ముందే ఊహించగలిగేలా ప్రేక్షకులు ఉన్నారు. కనుక వారికి కొత్తదనం ఇవ్వాలనే ప్రయత్నంగానే ఈ చిత్రం చేస్తున్నాం.
కొత్త వైశాఖం
ప్రేమకథతోనే సాగుతూ కుటుంబమంతా కలసి చూడగలిగే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం సాగుతుంది. కథను చెప్పే విధానం కూడా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. ప్రతి ప్రేక్షకుడు మనకే ఇలా జరిగిందా అనేలా సన్నివేశాలు ఉంటాయి. నేను చేసిన ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు తప్పక ఉంటాయి.
అప్పట్లో నవలలు ఉండేవి
తెలుగులో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న విజయనిర్మలతో నన్ను పోలుస్తున్నప్పుడు ఆనందంగా వుంటుంది. ఆమె చేసిన చిత్రాలే వారికి మంచి పేరు తెచ్చాయి. అప్పట్లో నవలలు బాగా ఉండేవి. దాంతో ‘మీనా’ వంటి చిత్రాలు చేశారు. పైగా ఆమెకు హీరో కృష్ణ తోడు ఉండడంతో సులభమైంది. ఇప్పుడు నవలా చిత్రాలు రావడం లేదు. పైగా నాకు హీరో కూడా లేడు. బి.ఎ.రాజుని హీరోగా మార్చాలేమో!
నాగార్జునకోసం
‘లవ్‌లీ’ సినిమా తర్వాత నాగార్జున నాతో సినిమా చేస్తానని, మంచి కథ ఉంటే తీసుకురమ్మన్నారు. నిజంగా ఈ అవకాశం రావడం ఆనందం. అయితే నాగార్జునలాంటి పెద్ద స్టార్‌తో సినిమా అంటే అనేక కమిట్‌మెంట్స్ ఉంటాయి. ఆయన ఇమేజ్‌ను బేస్ చేసుకుని సినిమా చేయాలి. కనుక అలాంటి మంచి కథకోసం ప్రయత్నం చేస్తున్నాను.
సొంత బ్యానర్‌లోనే
‘వైశాఖం’ సినిమా ఆర్.జె. సినిమా పతాకంపై రూపొందనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఓ మంచి కుటుంబ కథతో తెరకెక్కే ఈ చిత్రం అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా నిర్మాత జాగ్రత్త తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాను.

- శ్రీ