30 నుండి చరణ్ సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృవ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న రామ్‌చరణ్ నిర్మాతగా కూడా చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల ఊపుతో జోరుమీదున్న చరణ్, తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్టు జనవరి 30న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు తెలిసింది. సుకుమార్ శైలిలో వుండే ఇది అచ్చమైన పల్లెటూరి నేపథ్యంలో వుంటుందని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్నటితరం క్రేజీ హీరోయిన్ రాశి కీలకపాత్ర పోషిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.