‘పెటా’ కు సూర్య నోటీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో సూర్య ‘పెటా’ (జంతు హక్కుల సంస్థ)కు శనివారం నోటీసులు ఇచ్చారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సినీనటులు మద్దతు ప్రకటించడంపై ‘పెటా’ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టును నిషేధించాలని ‘పెటా’ డిమాండ్ చేయడం పట్ల సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలకు, వ్యక్తిగత ప్రచారం కోసమే నటీనటులు జల్లికట్టుకు మద్దతు ఇవ్వడం సరికాదని ‘పెటా’ అంటోంది. తమకు దురుద్దేశాలను అంటగట్టడం సరికాదని సూర్య విమర్శించారు.
జల్లికట్టుపై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, చెన్నైలోని మెరీనా తీరానికి చేరుకున్న వేలాదిమంది యువకులు, విద్యార్థులు జల్లికట్టును అనుమతించాలని పోరుబాట పట్టారని ఆయన అన్నారు.
ఈ పోరాటానికి సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ నాయకత్వం వహించడం లేదని, యువత ఆందోళనకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.