సింగర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో హీరోహీరోయిన్లు నటననే కాకుండా పాటలు పాడడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లు పాటల పాడి ఆకట్టుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి చేరింది గ్లామర్ భామ కాజల్. ఇప్పుడు ఈమె సరసన మరో హీరోయిన్ చేరనుంది. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ప్రియమణికి ఈమధ్య అసలు కలిసిరావడం లేదు. చేసిన సినిమాలన్నీ వరుస పరాజయాలు సాధిస్తుండడం, దానికితోడు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఓ చిత్రంలో పాట పాడేందుకు ఓకే చెప్పిందట. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న ప్రియమణికి ‘దేవరన్‌వే బుడుగురు’ అనే చిత్రంలో ఓ పాట పాడమని అడిగారట. దానికి ఆమె ఓకే చెప్పిందని తెలిసింది. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయనున్నారట. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు సాగిస్తోంది.