3న లక్కున్నోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం.వి.వి. సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం లక్కున్నోడు. మంచు విష్ణు, హన్సిక జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఫిబ్రవరి 3న సినిమా విడుదలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సన్నివేశాలు వైవిధ్యంగా వుంటాయని, డైమండ్ రత్నబాబు స్క్రీన్‌ప్లే, మాటలు ఆకట్టుకుంటాయని తెలిపారు. ఇప్పటికే విడదలైన పాటలకు, ట్రైలర్లకు మంచి ఆదరణ లభించిందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని దర్శకుడు రాజ్‌కిరణ్ తెలిపారు. తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:పి.జి.విందా, సంగీతం:అచ్చు, స్క్రీన్‌ప్లే, మాటలు:డైమండ్ రత్నం, కథ, దర్శకత్వం:రాజ్‌కిరణ్.