నటన నావల్ల కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంపుసొంపులు తెరపై ప్రదర్శించమంటే ఎంతైనా చేయగలం. నటన అంటేనే కొంచెం వెనకాముందూ ఆలోచించాలి. ఎందుకంటే నటనంటే ఏంటో నాకు తెలుసు అంటూ చెబుతోంది సన్నీలియోన్. హాట్ హాట్ అందాలతో బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ భామ ‘నటించే సత్తా ఉన్న పాత్రలు’ కావాలని కోరుకుంటోంది. ది డర్టీ పిక్చర్ లాంటి సినిమా చేయాలని తనకూ ఉందని అంటోంది. ఆ చిత్రంలో విద్యాబాలన్ అందాల ప్రదర్శనతోపాటుగా చక్కని అభినయం చేసిందని, అలాంటి కథ కోసం తాను చూస్తున్నానని చెబుతోంది. నటనలో విద్యాబాలన్‌తో పోటీపడి నటించగలవా? అంటే - అంత నటన నావల్లకాదు అంటూ జవాబు చెప్పింది. అయితే నావంతు ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తా. కేవలం అందాల ప్రదర్శనేకాక మంచి నటిగా కూడా మార్కులు కొట్టేస్తా అంటూ చెబుతోంది. ఎవరి కథలో ఎందుకు? నీ కథనే ఓ మంచి స్క్రిప్ట్‌తో తీసేస్తే పోలా? అని స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఏమో తన కథలో తానే నటిస్తుందేమో చూడాలి! ఎందుకంటే ఆమె కథ కూడా అందరికీ ఆసక్తిని కలిగించేదే!