గీతాపురి కాలనీ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.ఆర్.కె. ఫిలిమ్స్ పతాకంపై గరళకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలో డికొండ దుష్యంత్‌కుమార్, జి.రామకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం గీతాపురి కాలనీ. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పాటల రచయిత చంద్రబోస్ తొలి సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా జి.రామకృష్ణ మాట్లాడుతూ, గతంలో తాను రూపొందించిన గంగపుత్రులు చిత్రానికి అనేక పురస్కారాలు లభించాయని, మంచి కథ లభించడంతో ఈ సినిమా రూపొందించామన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వారి భవిష్యత్ పాడైపోవడమే కాక, దేశమే కష్టాల్లో పడుతుందన్న అంశం తనకు బాగా నచ్చిందని, అందుకే ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చామని తెలిపారు. ట్రైలర్లు, పాటలు బాగున్నాయని, ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు. మంచి నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుని ఈ చిత్రం చేశామని నిర్మాత డికొండ దుష్యంత్ కుమార్ తెలిపారు. ఐదు కథల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకచోట ఎదురుపడిన పాత్రలు కనిపిస్తాయని, భద్రాచలం, పాల్వంచ తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశామని దర్శకుడు శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు.