తండ్రి దర్శకత్వంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని, యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు అడపాదడపా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన ఆయన మరోసారి దర్శకత్వం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి యాక్షన్ సినిమాతో కాకుండా ప్యూర్ లవ్ స్టోరీతో సినిమా చేస్తాడట. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా అర్జున్ కూతురు ఐశ్వర్య నటిస్తుండటం. కూతురు నటించే ప్రేమకథను తండ్రి రూపొందించడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐశ్వర్య ఇదివరకే హీరోయిన్‌గా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. రెండు, మూడు సినిమాలు చేసినా కూడా సరైన బ్రేక్ దక్కలేదు. కొన్నాళ్లుగా అవకాశాలు రావడం లేదు. మరి తండ్రి రూపొందించే సినిమాతో అయినా ఐశ్వర్యకు కమర్షియల్ బ్రేక్ వస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో కన్నడ హీరో చేతన్‌కుమార్ హీరోగా నటిస్తున్నాడు.