తపనతో వస్తేనే కొత్త వాళ్లకు ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, అనుష్క, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న సింగం-3 భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా మల్కాపురం శివకుమార్ చెప్పిన విశేషాలు..
అనుకోని కారణాలు..
ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇన్నాళ్లూ పెద్దనోట్ల రద్దు ప్రభావం ఉండడంతో ఈనెల 26న విడుదల చేస్తున్నాం. సింగం-1, సింగం-2 చిత్రాలు ఎలాంటి ఘన విజయాన్ని అందుకున్నాయో వాటిని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది.
నిబద్ధత ఉన్న పోలీస్
ఈ చిత్రంలో సూర్య పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసే అంకితభావం వున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఉంటే సమాజానికి ఎలాంటి మంచి జరుగుతుందనే అంశాన్ని చూపిస్తూ రూపొందించిన చిత్రమిది. సూర్య తనదైన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తప్పకుండా ఆయన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రం అవుతుంది.
అందం, అభినయాల కలయిక
ఈ చిత్రంలో అనుష్క పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అనుష్క కెరీర్‌లో మంచి పాత్ర ఇది. మరో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. శృతిహాసన్ గ్లామర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
కమర్షియల్ అంశాలతో
హేరిష్ జైరాజ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలు జనాల్లో మంచి ఆదరణ పొందాయి. కెమెరా, ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా 60 శాతం షూటింగ్ హైదరాబాద్, వైజాగ్‌ల్లో చిత్రీకరించడంతో తెలుగు సినిమాలా ఉంటుంది. సూర్యకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. దాన్ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది.
భారీ విడుదల
ఇంటర్నేషనల్, పొలిటికల్ మాఫియాను అంతం చేయడానికి ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ఏం చేశాడన్నదే అసలు కథ. ఈ చిత్రాన్ని తెలుగు భాషలోనే వెయ్యికి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళ కలుపుకుని 3వేల థియేటర్ల వరకూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. కెరీర్ పరంగా మంచి సంతృప్తినిచ్చిన సినిమా ఇది.
మంచి చిత్రాలు
మంచి సినిమాలు తీయాలని పరిశ్రమకు వచ్చాను. మా సుర బ్యానర్‌లో తీసిన సూర్య వర్సెస్ సూర్య చాలా సంతృప్తినిచ్చింది. మంచి కథతో భారీ సినిమాలు కూడా తీస్తాను. సినిమా మీద పాషన్ ఉంటే కొత్త వాళ్లతో అయినా సినిమాలు చేస్తాను. ఫిబ్రవరిలో ఓ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ ఏడాది మూడు చిత్రాల్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం.

- శ్రీ