పాపం సమంత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సమంతకు టాలీవుడ్‌లో అవకాశాలు బొత్తిగా రావడం లేదు. కాబోయే భర్త నాగచైతన్యతో చెట్టపట్టాలు వేసుకొని విదేశాల్లో షికార్లు చేస్తోంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంతకు ఈ మధ్య సినిమా అవకాశాలు రాకపోవడం ఏంటనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని కుటుంబానికి కోడలు అవుతోందన్న కారణంగానా? లేక మరే కారణమో గానీ సినిమాలు మాత్రం చేతిలో లేవు. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈమె తెలుగులో వస్తున్న అవకాశాలకు ‘నో’ చెబుతోందంటూ వార్తలు వస్తున్నాయి. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కనున్న మహానటి సినిమాలో సమంత నటిస్తుందని వార్తలు వినిపించాయి. మరే సినిమాల్లో అవకాశాలేవీ రావడం లేదట! కారణాలు ఏవైనప్పటికీ క్రేజీ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండగానే సమంత ఎందుకిలా మారిందని ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి సమంత ఆలోచన ఎలా ఉందో కానీ అటు స్టార్ హీరోల సినిమాలు గానీ, ఇటు యువహీరోల సినిమాల్లోగానీ ఈమెకు ఆఫర్స్ రావడం లేదని టాక్!