ముస్తాబవుతున్న చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో, తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్, కామెడీ చిత్రాన్ని దర్శకుడు శ్రీవిఘ్నేష్, కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆడియోను త్వరలో విడుదల చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్, కామెడీ జోనర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియెన్స్‌కు షాక్‌కు గురిచేస్తాయి. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతోపాటు తమిళంలో కూడా అంజలియే ఈ పాట పాడింది. అంజలి తన కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రను చిత్రాంగదలో పోషిస్తోంది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి ఆకర్షణగా వుంటుంది. కొన్ని అదృశ్యశక్తుల కారణంగా ఆమె జీవితం ఏవిధంగా చిక్కుల్లో పడింది, తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రం ఇతివృత్తం. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ చిత్రీకరించాం అన్నారు. జెపి, సప్తగిరి, రాజారవీంద్ర, సింధు తులానీ, రక్ష, దీపక్, సాక్షి గులాటి, జబర్దస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సెల్వ గణేష్, స్వామినాథన్, ఎడిటర్:ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అశోక్.జి., నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్.