క్లైమాక్స్‌లో జానకిరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరి ట్రావెల్స్ సమర్పణలో తమ్మినీడు సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపి నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌బాబు మాట్లాడుతూ ఓ అందమైన పల్లెటూరి వాతావరణంలో జరిగే ప్రేమకథగా ఈ చిత్రం సాగుతుందని, తొలకరి చినుకుల స్పర్శకు పులకరించిన మట్టి పరిమళంలా అందంగా మనస్సును తాకుతుందని, ఆస్వాదించే హృదయం వుంటే అద్భుతంగా నచ్చుతుందని తెలిపారు. సున్నితమైన భావాలతో కూడిన ఈ ప్రేమకథలో ఏం జరిగింది? ఎలా ముగిసింది? అన్న కథనంతో చిత్రం సాగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలోనే విడుదల చేసి, ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అందమైన పేరుకు తగిన విధంగా సినిమా కూడా సున్నితమైన భావోద్వేగాలతో సాగుతుందని, అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా ప్రమోషన్‌ను వైవిధ్యంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నాయుడు తెలిపారు. శివకృష్ణ, సుధ, పవిత్ర లోకేష్, ప్రియాంక, అర్జున్, సూర్య, నల్లవేణు, కమల్, గుండు సుదర్శన్, జాకి, కిరణ్, మీనాకుమారి, గీతాంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిత్, సంగీతం: గిఫ్టన్ అలియాస్, పాటలు: శ్రీమణి, అనంత్‌శ్రీరామ్, నిర్మాత: ఎం.పి. నాయుడు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తమ్మినీడి సతీష్‌బాబు.