షాకింగ్ కామెంట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తన ప్రతిభతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది ప్రియాంకా చోప్రా. అక్కడి నుండి హాలీవుడ్‌కి కూడా వెళ్లింది. అమెరికాలోని క్వాంటికో షోతో హాలీవుడ్ రిలయాలిటీ షోలతో బిజీ బిజీగా వుంది ప్రియాంక. ఇటీవల ఆమె ‘కాఫీ విత్ కరన్ షో’లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో కరన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యపోయే సమాధానాలు ఇచ్చింది. ‘నువ్వు కొంతమందితో ఫోన్ రొమాన్స్ చేస్తావట కదా..’ అని అడిగితే, ‘అవును.. నేను అలా చేస్తాను’ అని తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. ర్యాపిడ్ రౌండ్‌లో భాగంగా ఫోన్ రొమాన్స్‌లో పాల్గొన్నానని చెప్పిందట. మరో వ్యక్తితోకలిసి స్నానం కూడా చేశానన్నదట. విడిపోయిన నా బోయ్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్నానని బాహాటంగా చెప్పేసింది. 25 స్క్రిప్ట్‌లను పరిశీలించిన తరువాత ‘క్వాంటికో’కు కాల్షీట్లు ఇచ్చానని చెప్పుకొచ్చింది. ఏమైనా డేర్ డెవిల్ ప్రియాంకా చోప్రానే!