చివరి దశలో కాటమరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కల్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాటమరాయుడు చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో, అతని తమ్ముళ్ల పాత్రలో నటిస్తున్నవారిపై సెంటిమెంటల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరికల్లా షూటింగ్‌ని పూర్తిచేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఉగాదికి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. టీజర్‌ను జనవరి 26 విడుదల చేయాలని మొదట భావించినా వాయిదా పడింది. డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.