జల్లికట్టు’ పోరులో విధ్వంసం దేనికి? - కమల్‌హాసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పెల్లుబికిన నిరసనలను ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం చేస్తున్న చర్యలను అందరూ ఖండించాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. జల్లికట్టును అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. యువత చేస్తున్న ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు హింసకు, విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆయన మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. పోలీసులే ఆటోలకు నిప్పటించి ఆ నేరాన్ని యువతపై నెట్టేయడం గర్హించదగినదని అభిప్రాయపడ్డారు. మెరీనా బీచ్ నుండి విద్యార్థులను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం కోసం పోలీసులు ఆడుతున్న నాటకం మంచిది కాదని, యువత కూడా దీక్షలు విరమించాలని కమల్ అన్నారు. యువతను ఖాళీ చేయించడం కోసం నిరసనలను హింసాత్మకంగా మారుస్తున్నది ఎవరన్నది అందరికీ తెలుసునని అన్నారు.