రానాతో కేథరిన్ రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో రానా ఎవరితో రొమాన్స్ చేస్తున్నాడా? అన్న ఆసక్తి కలిగిందా? అయితే ఈ విషయం విన్న తరువాత మీకే తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఘాజీ సినిమాలో నటించిన రానా తన తర్వాతి ప్రాజెక్టుగా తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’లో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా, ఇటీవల అల్లుఅర్జున్ సరైనోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హాట్ భామ కేథరిన్ ట్రెసా నటిస్తుందట! ‘సరైనోడు’లో ఎంఎల్‌ఏగా నటించి మంచి మార్కులు కొట్టేసిన కేథరిన్ ఇందులో కూడా పొలిటికల్ నేపథ్యం వున్న పాత్రలోనే కనిపిస్తుందని సమాచారం. మెగాస్టార్ ఖైదీనెం.150 సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్‌ను ఆమె మిస్ అయిందట!