నెలాఖరుకు లచ్చిందేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖా క్రియేషన్స్ పతాకంపై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చిత్రం ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- నూతన సంవత్సర కానుకగా ఈనెల 1న విడుదల చేద్దామనుకున్నామనీ, కానీ కారణాంతరాలవల్ల ఈనెలాఖరుకు విడుదల చేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు మంచి రెస్పాన్స్ లభించిందని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశామని, నవీన్‌చంద్ర, లావణ్యల నటన ఈ చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, పాటలు:శివశక్తిదత్తా, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:ఈశ్వర్, నిర్మాత:సాయిప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం:జగదీష్ తలశిల.