పాటల్లో సీతమ్మ అందాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, ఆర్తన జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు ఎన్.శంకర్ సీడీలను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ సమయంలో సంగీత దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీసుందర్ ఈ చిత్రానికి మంచి పాటలు అందించారన్నారు. శ్రీనివాస్ గవరెడ్డి పాత్రల్లో వెటకారం ఎక్కువని, రాజ్‌తరుణ్‌లో మమకారం ఎక్కువని, మంచి లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది అన్నారు. హీరో రాజ్‌తరుణ్ మాట్లాడుతూ, పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో వుండే అందమైన ప్రేమకథా చిత్రం ఇది అన్నారు.
నిర్మాత శైలేంద్రబాబు మాట్లాడుతూ, కన్నడంలో సినిమాలు చేశానని, తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలని ఈ సినిమా నిర్మిస్తున్నానన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లడుతూ, రాజ్‌తరుణ్ హ్యట్రిక్ తరువాత చేస్తున్న సినిమా ఇదని, ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ మొదలవ్వాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, మదన్, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.