పెళ్లి వద్దంటే పోలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి అనేది వ్యక్తిగత జీవితంలో తప్పనిసరి. అయితే, నా వ్యక్తిగత నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఫలితాలు ఎలా వచ్చినా అది నాకు సంబంధించినదే. దేవుడు ఉన్నాడు కనుక చూసుకుంటాడులే అన్న నమ్మకంతోనే ఉంటానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. పెళ్లిచేసుకున్నప్పుడు ఇరువురి అభిరుచులు ఒకటిగా వున్నప్పుడే వారి దాంపత్యం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుందని, సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టపడే నేను అలాంటి ఇష్టమున్న వ్యక్తినే పెళ్లిచేసుకుంటానని, లేకపోతే విడిపోవడమే వుంటుందని అంటోంది. అయినా విడిపోయేదానికి ఇక పెళ్లెందుకు చేసుకోవడం? పెళ్లి మానేస్తే పోలా? అని మరో ప్రశ్న కూడా వేస్తోంది. ఏ ప్రశ్నలు వేసినా ఆమె చెప్పే జవాబులు చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె టాప్ స్టార్ కనుక!