క్రిస్మస్‌కు అబ్బాయితో అమ్మాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రమేష్ వర్మ దర్శకత్వంలో మోహనరూపా ఫిలింస్, జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట రూపొందించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.
నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ పనులు పూర్తిచేశారు. క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఇళయరాజా స్వరాలు అందించిన పాటలు ఇటీవల విడుదల చేశామని, ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉన్నాయని తెలిపారు. ఓ అందమైన ప్రేమకథతో గతంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందిందని, ప్రేమకథ అయినా మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని పొయిటిగ్గా తీశారని తెలిపారు. నాగశౌర్య పాత్ర చిత్రంలో సరికొత్తగా డిజైన్ చేశామని, కథానాయిక అందం, అభినయం సినిమాకు హైలెట్‌గా వుంటాయని, ప్రేమకథా చిత్రాలలో ఓ వైవిధ్యమైన సనిమాగా తప్పక గుర్తింపు వస్తుందని వారు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు అన్నారు. బ్రహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, పాటలు:రహమాన్, దర్శకత్వం:రమేష్ వర్మ.