ఏం చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీనెం.150లో రాయ్‌లక్ష్మి చేసిన ‘రత్తాలు రత్తాలు’ ఐటెమ్ సాంగ్ యువతకు గిలిగింతలు పెట్టింది. ఇప్పటివరకూ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాయ్‌లక్ష్మి ఇపుడు ‘ఐటెమ్ గర్ల్’ బిరుదును జీర్ణించుకోలేకపోతోంది. హీరోయిన్‌కన్నా ఐటెమ్ పాటే బాగా చేసిందని అంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా పొగిడిన నిర్మాతలు కొందరు తమ చిత్రంలో ఓ ఐటెమ్ పాత్రలో నటించమని అడుగుతున్నారట! హీరోయిన్‌కన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తున్నారట. దీంతో ఐటెమ్‌గర్ల్‌గా ఎదగాలా? లేక అవకాశాలు వచ్చినపుడే హీరోయిన్‌గా నటించాలా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతోంది రాయ్‌లక్ష్మి. ఐటెమ్ పాటకే ఇంత భారీ పారితోషికాలు ఇస్తుంటే, అది వదులుకోలేక ఇటు హీరోయిన్ ఛాన్సులు మిస్ అవుతాయేమోనన్న బెంగతో ఉందట. ఏం చేయాలో అభిమానులన్నా చెబితే బాగుండు.