సీక్వెల్స్ మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలో సీక్వెల్ మానియా పట్టుకుంది. ఒక చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకోవడమే ఈ సీక్వెల్స్ లెక్క. ఈ ఏడాది సీక్వెల్స్ సినిమాల హవా జోరుమీదుంది. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో రూపొంది రికార్డులు సాధించిన చిత్రాలకు సీక్వెల్స్‌గా అంతకుమించిన భారీ బడ్జెట్‌తో సినిమాలు రూపొందిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. సీక్వెల్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. మొదటి భాగమే అంత బాగా ఉందంటే రెండో భాగం ఇంకా ఎలా ఉంటుందో అనే ఆసక్తిని ప్రదర్శిస్తారు. దానికి అనుగుణంగా ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోడానికి దర్శక నిర్మాతలు వేసే ఎత్తుగడలు మామూలుగా ఉండవు. ఇక ఈ సీక్వెల్స్‌లో చెప్పుకోవాల్సిన సినిమా ‘బాహుబలి-2’. ఇంతకుముందు ‘బాహుబలి’ పేరుతో వచ్చిన చిత్రం ఏ రేంజ్ రికార్డుల్ని క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన చిత్రంగా ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్‌ని పెంచిన సినిమాగా ‘బాహుబలి’ నిలిచిపోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి-2’ (ది కంక్లూజన్) సినిమా కూడా ఆ స్థాయికి మించే రూపొందిస్తున్నాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి. ప్రభాస్ కథానాయకుడుగా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో సినిమాను ముగించారు. ఇప్పటికీ ఆ ప్రశే్న ప్రతీ ప్రేక్షకుడిలో నెలకొని ‘బాహుబలి-2’పై అంచనాలను పెంచుతోంది. నిజానికి గత ఏడాది దసరాకు రావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలవల్ల ఈ సమ్మర్‌లో విడుదలవుతోంది. ఇప్పటికే ప్రమోషన్ పరంగా అత్యంత భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. విడుదల కూడా అంతే భారీగా ఉండనుంది. ఇక ఈ సినిమా తరువాత చెప్పుకోవాల్సిన మరో చిత్రం ‘రోబో 2.0.’ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన రోబో సంచలన విజయం సాధించి 100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రోబో 2.0’ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొంది. రోబో చిత్రంలో రోబో చిట్టిని కోర్టు ఆదేశాల ప్రకారం డిస్‌మేండిల్ చేస్తారు. ఆ తరువాత ఆ రోబోను బయటికి తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో రోబో-2ను తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తుండడం విశేషం. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్ నటిస్తోంది. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లతో శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలై ఇంకెలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రముఖ నటుడు సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన సీక్వెల్‌లో మూడో భాగంగా రూపొందిన చిత్రం ‘సింగం-3’. సింగం సీక్వెల్‌లో రూపొందిన ‘సింగం-1’, ‘సింగం-2’ చిత్రాలు ఘన విజయం సాధించడంతో దానికి మరో సీక్వెల్‌గా రూపొందిన చిత్రమిది. ఇంటర్నేషనల్ కాప్‌గా సూర్య తనదైన నటనతో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో మరి.

-శ్రీ