గత చిత్రాలతో పోలిక ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నమయ్య చిత్రం నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా నిలిచింది. మళ్లీ అలాంటి కథతోనే సినిమా చేస్తే బాగోదనుకున్నా. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆసక్తిలేకపోయినా భిన్నమైన స్క్రిప్ట్‌గా అనిపించింది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రం గత చిత్రాల పోలికలతో ఉండదు. అందుకే ‘ఓం నమో వెంకటేశాయ’ చేశాను.. అని అక్కినేని నాగార్జున తెలిపారు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం గూర్చి నాగార్జున పలు విశేషాలు తెలిపారు.
కథా నేపథ్యం
హథీ రాంబాబా వేంకటేశ్వరుడికి పరమ భక్తుడు. ఆ దేవుడికి ఏదైనా జరిగితే సహించలేడు. కొండ సమీపాన ఉన్నవన్నీ స్వామికే చెందాలని కోరుకుంటాడు. స్వామిని కలవాలని తిరుమల వెళతాడు. అక్కడ కృష్ణమ్మను కలిశాక జరిగే ఆసక్తికర పరిణామాల సమాహారమే ఈ చిత్రం. దర్శకుడు రాఘవేంద్రరావు కొంత నాటకీయత జోడించి స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు.
నిరీక్షణ తప్పదు..
ఈ సినిమా మొదట అనుకున్న విధంగానే సంక్రాంతి బరిలో లేదు. గత ఏడాది సోగ్గాడే చిన్నినాయనా హిట్ కావడంతో నిర్మాత, యూనిట్ సభ్యులు ఈసారి నా సినిమా సంక్రాంతికి ఉంటుందని అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికి పూర్తి కానందున సంక్రాంతికి విడుదల చేయలేదు. గ్రాఫిక్స్‌కు ఎంత టైమ్ పడుతుందో తెలీదు. ఇప్పటికీ కొన్ని సవరణలు చేస్తూనే ఉన్నాం. కొన్ని రోజులు ఆగాల్సిందే.
సంగీతం ఎసెట్
భక్తిరస చిత్రాలకు మంచి సంగీతం ముఖ్యం. కథలోని అంతరార్థాన్ని పాట రూపంలో చెప్పాలి. అందుకు కీరవాణి సంగీతమే బెస్ట్. స్వచ్ఛమైన రాగాలను కట్టారు.
కమర్షియల్‌కు, భక్తికి తేడా
కమర్షియల్ చిత్రాలంటే మనం రోజూ చేసుకునే పనుల్లాంటివి. భక్తిరస సినిమాలంటే ఉదయానే్న లేచి, తల స్నానం చేసి గుడికి వెళ్లిరావటంలా వుంటుంది. జీవితంలో రెండూ ఉండాలి. ఇలాంటి చిత్రాలు చేయడంతో నాలో కూడా మార్పు వచ్చింది. స్వచ్ఛమైన తెలుగును అచ్చులు, పొల్లులు, దీర్ఘాలు వత్తి పలకడం నేర్చుకున్నాను. భాషపై కొంత అవగాహన వచ్చింది.
చిరంజీవి రీ ఎంట్రీ
పది సంవత్సరాల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం సంతోషం. చిరు నటించిన 150వ సినిమా చూశాను. బాలకృష్ణ నటించిన ‘శాతకర్ణి’ సినిమాను క్రిష్ తక్కువ టైమ్‌లో అద్భుతంగా తెరకెక్కించాడు. బాలకృష్ణ తప్ప ఆ పాత్రలో ఎవరూ నటించలేరు.
రిలాక్స్‌గా
ఇటీవల వరుస విజయాలతో రిలాక్స్‌డ్‌గానే ఉన్నా. నెంబర్ గేమ్‌లు, క్లబ్బులకు దూరంగా ఉన్నా కాబట్టి మరింత హ్యాపీగా ఉన్నా. నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నా. ఆలోచనా విధానం కూడా మారింది.
కోటీశ్వరుడు వదులుకున్నా
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నుంచి తప్పుకోవడానికి ప్రత్యేక కారణం ఏమీలేదు. మూడు సీజన్లు చేశాను. విభిన్నమైన వ్యక్తులను కలిశాను. అనేక విషయాలు తెలుసుకుని, చాలనుకున్నాను. మొనాటనీ అవుతుందని వదులుకున్నా. చిరంజీవితో ఆ ‘షో’కు మరింత క్రేజ్ వస్తుందని భావిస్తా.
తదుపరి చిత్రం
రాజుగారిగది-2 షూటింగ్ జరుగుతోంది. కళ్యాణకృష్ణ, నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నా. తర్వాత బంగార్రాజు సినిమాలో నటిస్తా. చందు మొండేటి దర్శకత్వంలో ఇంకా ఫైనల్ కాలేదు. అఖిల్ తరువాతి చిత్రం విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ఉంటుంది. ఆ సినిమాతో ఓ కొత్త జోనర్‌ను క్రియేట్ చేయాలని భావిస్తున్నాం.
ఇద్దరబ్బాయిల పెళ్లిళ్లు
నాగచైతన్య, అఖిల్ పెళ్లిళ్లకు నిశ్చితార్థాలు అయిపోయాయి. పెళ్లిళ్లు ఎప్పుడు ఎక్కడ అనేది వాళ్లిష్టం. ఒకేసారి చేసుకుంటే నాకు రిస్క్ తప్పుతుందని చెప్పా. కచ్చితంగా రెండు పెళ్లిళ్లు ఈ సంవత్సరంలోనే ఉంటాయి.

- శ్రీ